(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పాలనలోనే సంక్షేమ ఫలాలు అందాయని, చివరిసారిగా పోటీ చేస్తున్నానని ఓటు వేసి గెలిపిస్తే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు.శనివారం నర్సింహులపేట మండలంలోని పడమాటిగుడెం,నర్సింహులపేట,కొమ్ములవంచ,జయపురం,కౌసల్యదేవిపల్లి ,బొజ్జన్న పేట,రామన్నగూడెం ,ముంగిమడుగు గ్రామాలు మరియు శివారు తండాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పడమాటిగుడెం గ్రామంలో ప్రజలు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ మాట్లాడుతూ నేను పక్క లోకల్.. లోకల్ని కాబట్టి ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉంటది.. పట్టుదల ఉంటది..పనిచేయాలని ఆశ ఉంటది. బయటి నుండి వచ్చే వారికి ఇక్కడి ప్రజల మీద శ్రద్ధ ఉండదు..! పనిచేయాలని తపన ఉండదని, పని కట్టుకొని సూర్యాపేటకు వెళ్లాలి సేవ తెలవదు ప్రజల విలువ తెలవదని అన్నారు. మీకు సేవ చేయడానికి రెడ్యా నాయక్ మాత్రమే నిజమైన సేవకుడని నియోజకవర్గం ఒక దేవాలయం,ప్రజలు దేవుళ్ళుగా భావించే నాకు మీ సేవ చేయడానికి చివరిసారి అవకాశం కల్పించాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని, కెసిఆర్ బీమా ప్రతి ఇంట భీమా పథకంతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల బీమా కల్పిస్తామని,15 లక్షల రూపాయల ఆరోగ్య స్కీం రు 16 వేల రైతుబంధు మొదలైన సంక్షేమ పథకాలను విజయవంతంగా చేపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిమ్ముల వెంకట్ రెడ్డి, టిఆరెస్ యూత్ విభాగం మండల కార్యదర్శి మంచాల శ్రీశైలం,సర్పంచ్ జొన్నగడ్డల యాదలక్ష్మి వెంకన్న,ఎంపీటీసీ పాతూరి మధు రెడ్డి,మాజీ ఎంపిటిసి పాతూరి రమేష్ రెడ్డి,వీరూనాయక్, సర్పంచ్ కుంబాల నర్సమ్మ లింగయ్య,మాజీ సర్పంచ్ లు హెచ్చు వెంకన్న , మేకల వెంకన్న ,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, పాతూరి ప్రభాకర్ రెడ్డి ,నాయకులు దారం వేదయ్య ,యుగెందర్,జక్కుల యాకన్న,అలువాల యాకన్న,కుంబాల మనోహర్,పాతూరి అశోక్ ,పిట్టల లింగయ్య,దాసరోజు ఈశ్వరాచారి,సైదులు,రాజేష్, ఆనంద్ వార్డు సభ్యులు ,ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు బిఆర్ఎస్ తోనే సాధ్యం...ఈ ఒక్కసారి ఓటెయ్యండి..!-ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్.
November 11, 2023
0
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.


.jpg)
.jpg)