●కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతాం.
◆సోషల్ మీడియా మండల అధ్యక్షుడు చిల్ల రామకృష్ణ.
(నమస్తేమానుకోట-దంతాలపల్లి)
ఇతర పార్టీల మాయమాటలు నమ్మితే మోసపోతామని,ఆపదలో కార్యకర్తల వెన్నంటే ఉండి కాపాడే ఆపద్బాందవుడు రెడ్యానాయక్ మాత్రమే నని ,డోర్నకల్ గడ్డపై బీఆర్ఎస్ అభ్యర్ధి డిఎస్ రెడ్యానాయక్ గెలుపు ఎవరు ఆపలేరని సోషల్ మీడియా మండల అధ్యక్షుడు చిల్ల రామకృష్ణ అన్నారు.గురువారం కుమ్మరికుంట్ల గ్రామంలో కార్యకర్తలతో కలిసి రెడ్యానాయక్ కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజా సంక్షేమంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని,ప్రజలు బీఆర్ఎస్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ప్రజల నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజాభివృద్దే ధ్యేయంగా రెడ్యానాయక్ పనిచేస్తున్నారని అన్నారు.ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసిన డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్యానాయక్ ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే రెడ్యాకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నమూనా బ్యాలెట్,ఈవిఎం లను చూపిస్తూ ఓటు వేసే విధానాన్ని తెలుపుతూ ఓటర్లను అభ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పాక ధర్మయ్య, నాయకులు పోల్దాసు యాకయ్య,పత్తి సురేష్,పత్తి పుల్లయ్య,సాతాని విష్ణు, తాటిమల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



