(నమస్తే మానుకోట-తొర్రూరు)
ఇటీవల మంత్రి కేటీఆర్, దయాకర్ రావుల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన తొర్రూరు మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్, యువ నాయకులు తూనం శ్రావణ్ కుమార్ లు సొంతగూటికి చేరారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి యశస్విని రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ గులాబీ పార్టీకి వెళ్లిన వారంతా మరో మారు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నమ్మి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పాలకుర్తిలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు.అనంతరం కౌన్సిలర్ తూనం రోజా మాట్లాడుతూ తమకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారని,తిరిగి తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి,టిపిసిసి మాజీ సభ్యుడు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, అనుమాండ్ల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కాందాడి అశోక్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బిక్షం గౌడ్, నల్లపు వెంకన్న, అరుణ్ తదితరులు ఉన్నారు.


