Type Here to Get Search Results !

రంగులు మార్చే వ్యక్తిని కాదు, నియోజకవర్గ అభివృద్ధికి ఎజెండాతో వచ్చా:ననావత్ భూపాల్ నాయక్.

నాయకుడు లేని సామ్రాజ్యాన్ని ,దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని నిలబడ్డా..!-ననావత్ భూపాల్ నాయక్.

◆మీ భవిష్యత్ మారాలన్నా ,రాజకీయాలకు కొత్త అర్థాన్ని చెప్పాలన్నా నాకు ఓటెయ్యండి:భూపాల్ నాయక్.

◆ఈ ప్రాంతానికి నేను కొత్తవాణ్ణయినా నన్ను ఆదరించినందుకు ధన్యుణ్ణి.

◆రంగులు మార్చే వ్యక్తిని కాదు, నియోజకవర్గ అభివృద్ధికి ఎజెండాతో వచ్చిన వ్యక్తిని.

◆రాజకీయ దాహంతో  రాలేదు...సమస్యల పరిష్కారానికి వచ్చా.

(నమస్తే మానుకోట-నర్సింహులపేట)

మీ భవిష్యత్ మారాలన్నా ,రాజకీయాలకు కొత్త అర్థాన్ని చెప్పాలన్నా తల్లిదండ్రులు-మీ కొడుకుల ఓట్లు ,యువతీయువకులు- మీతల్లిదండ్రుల ఓట్లు వేయించాలని ,ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మీ పిల్లల  జీవితాల్లో వెలుగులు నింపుతానని డోర్నకల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కిసాన్ పరివార్ వ్వవస్థాపకులు ననావత్ భూపాల్ నాయక్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా నర్సింహులపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. భూపాల్ నాయక్ టీం సభ్యులు చెలిమిల్ల గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో భూపాల్ నాయక్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం లో ముందుగా స్థానిక మండల అభివృద్ధి కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి నేను కొత్తవాణ్ణయినా నన్ను ఆదరించినందుకు ధన్యుణ్ణని ,నేను రంగులు మార్చే వ్యక్తిని కాదు నియోజకవర్గ అభివృద్ధికి ఎజెండాతో వచ్చిన వ్యక్తినని అన్నారు.
తాను ఏసీ రూములో కూర్చుని హాయిగా వ్యాపారం  చేసుకోవచ్చని కానీ డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న  ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ప్రజల ఆహ్వానం మేరకే డోర్నకల్ లో అడుగు పెట్టానని అన్నారు.రాజకీయ దాహంతో నేను రాలేదని  సమస్యల పరిష్కారానికి వచ్చానని అన్నారు. నేను మొదటిసారి చిన్నగూడూరు వచ్చినప్పుడు కొంతమంది దాడులు చేశారని , అప్పుడు అర్థమైంది భూపాల్ నాయక్ ఇక్కడికి వస్తే ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారని తద్వారా తమ రాజకీయ ఉనికి కోల్పోతామని భయపడి దాడులు చేయించారని గుర్తించానన్నారు.అందుకే ఇక్కడ ఉన్న యువతలో రాజకీయ చైతన్యం తీసుకొని రావాలని ఉద్దేశ్యంతో ప్రతి మండలానికి ఒక లైబ్రరీని నిర్మించుదామని నిర్ణయం తీసుకున్నా.. యువత గ్రంధాలయాలు వినియోగించుకోవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, తద్వారా సమాజం పట్ల అవగాహన పెరిగి తమ సమస్యలను  పరిష్కరించుకోగలుగుతారు... విద్యావంతులు ఉద్యోగాలు పొందితే రాజకీయ నాయకుల మాటలు వినరనే ,స్థానిక నాయకులు వారికి ఉపాధి లేకుండా చేస్తున్నారు.. అందుకే తాను నాయకుడు లేని సామ్రాజ్యాన్ని  నిర్మించాలని,దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని  నిలబడ్డానని అన్నారు. నేటి నాయకులు యువకులను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు కానీ నేను వారికాళ్ళమీద వాళ్ళు నిలబడేలా  కృషిచేస్తానని అన్నారు.కావనా నియోజకవర్గ ప్రజలు ఓటు వేసేటప్పుడు భూపాల్ నాయక్ ఎక్కడ ఉన్నారని గమనించి ఓటువేయాలని కనీ,వినీ ఎరుగని రీతిలో మీ అందరినీ అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర  అధ్యక్షుడు గాందీ నాయక్ , ఎల్.హెచ్.పి.ఎస్  రాష్ట్ర కార్యదర్శి భీమానాయక్ ,భూపాల్ నాయక్ టీం  నియోజకవర్గ ఇంచార్జి హరిబాబు ,ఎడెల్లి వెంకన్న ,వెంకటేశ్వర్లు ,సతీష్ ,ప్రకాష్ ,విష్ణు శంకర్ వివిధ గ్రామాల కోఆర్డినేటర్ లు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.