(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
మీ ఇంటి ఆడబిడ్డనై వస్తున్నా ,తనను ఆదరించాలని ఈ ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని,బాజాపా ఎమ్మెల్యే అభ్యర్థిని భూక్య సంగీత నాయక్ అన్నారు.శుక్రవారం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో పర్య టించారు.ముందుగా ముత్యాలమ్మ దేవాలయంలో గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు ,అభిమానులతో కలిసి ఆమె గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని బాజాపా తోనే సాధ్యమవుతుందని,బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని భాజపా పార్టీ ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు.కుటుంబ పాలనకు విసిగిపోయిన ప్రజలు బాజాపా వైపు మొగ్గుచూపుతున్నారని,ఈ ఎన్నికల్లో కషాయ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.నరసింహులపేటలో ఈటెల రాజేందర్ పాల్గొన్న బిజెపి జనగర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు ఈరగాని రమేష్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.




