కార్పొరేట్లకు దాసోహమై కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, హక్కులను హరించి వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలలో బుద్ధి చెప్పాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.కురివి మండల కేంద్రంలో ఏ ఐ టి యు సి 104 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షులు బుడమ వెంకన్న అరుణ పతాకాన్ని ఎగురవేయగా నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొన్న ఏకైక కార్మిక సంఘం, కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మొట్టమొదట ఈ దేశంలో ఏర్పాటైన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అని ,సంఘటిత ,అసంఘటిత రంగ కార్మికుల హక్కులను సాధిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా అలుపెరగని పోరాటాలు నిర్వహించి ,కార్పొరేట్ సంస్థల శ్రమ దోపిడీపై హక్కులను హరించే విధంగా పాలకవర్గాలు చేపట్టిన విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ఉద్యమాలు కొనసాగిస్తు కార్మిక పక్షపాతిగా గొప్ప చరిత్ర కలిగిన సంఘం ఏఐటియుసి .అసంఘటిత సంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తే ఈ దేశం, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఉక్కు పాదంతో ఆందోళనలను అణిచివేసి భయభ్రాంతులకు గురిచేసి ,సమ్మె చేయడమే నేరం, హక్కులనే అడగొద్దు అనే నియంతృత్వ విధానాలను పాల్పడుతున్న పాలక పార్టీలకు కార్మిక వర్గం సంగటితంగా చరమగీతం పాడాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్, ఏఐటియుసి నాయకులు బోల్లం ఉప్పలయ్య ,కలగూర నాగరాజు, కన్నె వెంకన్న, దూది కట్ల సారయ్య, అప్పల వెంకన్న, బొల్లం అనిల్ ,కూరాకుల వీరన్న తదితరులు పాల్గొన్నారు.


