అదనపు వసూళ్లకు పాల్పడుతున్న భారత్ గ్యాస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాజాపా మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.దంతాలపల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దంతాలపల్లి మండల ఉపాధ్యక్షులు అల్లం సాయికుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మానుకోట జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తగ్గించి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 603 రూపాయలకు, సాధారణ గ్యాస్ వినియోగదారులకు 903 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను తగ్గించినప్పటికీ మానుకోట జిల్లాలలో పలుచోట్ల భారత్ గ్యాస్ డీలర్లు అక్రమ అధిక వసుళ్లకు పాల్పడుతున్నారన్నారు దంతాలపల్లి మండలంలో ఉజ్వల పథకం కింద మంజూరు అయిన లబ్ధిదారుల వద్ద గ్యాస్ సిలిండర్ ధర ఒక్కొక్కరి వద్ద సుమారు 1050 రూపాయలు వసూలు చేస్తూ, సాధారణ గ్యాస్ వినియోగదారుల వద్ద 1250 రూపాయలు వసూలు చేస్తున్న స్థానిక భారత్ గ్యాస్ డీలర్ పై కఠిన చర్యలు తీసుకొని సంబంధిత ఏజెన్సీని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. సంబంధిత డీలర్ ఇక్కడ ఉన్న అక్రమ అధికారులు మరియు స్థానిక బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై పర్సెంటేజీలు పంచుకుంటున్నారని సంబంధిత ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా పక్షాన ఈ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి దాసరి మురళి, శివకుమార్, రమేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

