Type Here to Get Search Results !

కామ్రేడ్ నరేష్ మృతి పార్టీకి తీరని లోటు- సిపిఐ(ఎంఎల్ )న్యూడెమోక్రసీ

 

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బాలాజీ పేట గ్రామ కమిటీ సభ్యుడు కామ్రేడ్ చిర్ర నరేష్ అకాల మరణం పార్టీ కి తీరని లోటని సిపిఐ ఎంఎల్  న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య, బయ్యారం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు,పార్టీ జిల్లా నాయకులు గూగులోత్ సక్రు లు అన్నారు. నరేష్ మృతి పట్ల సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ  విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు గా తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కామ్రేడ్ నరేష్ భౌతిక కాయంపై అరుణ పతాకాన్ని కప్పి విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు కామ్రేడ్ తోకల వెంకన్న అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కామ్రేడ్ చిర్ర నరేష్ బాల్యం నుండి ఈ ప్రాంతంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలలో తన తండ్రి కామ్రేడ్ చిర్ర ముత్తయ్య చూపిన మార్గంలో వారసత్వంగా పనిచేస్తూ వస్తున్నాడని , ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న తునికి రేటు పెరుగుదల కోసం, వ్యవసాయ కూలీల రేట్ల పెరుగుదల కోసం, పోడుభూముల కు పట్టాలి ఇవ్వాలని తదితర సమస్యలపై జరిగే ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై అకాల మరణం చెందటం బాధాకరం అని అన్నారు. కామ్రేడ్ నరేష్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ వ్యవసాయ కూలి పనులు చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ విప్లవ రాజకీయాల పట్ల అచంచల విశ్వాసంతో తన శక్తి మేరకు ప్రజా ఉద్యమాలలో పనిచేశాడని అన్నారు. ఈ సంతాప సభలో కొత్త రామదాసు,గుడిబోయిన రమేష్ ,ఎర్రమళ్ళ చిన్న వెంకన్న ,పెద్ద వెంకన్న ,కుషిని వెంకన్న ,ఏర్నివెంకటేష్,లావుడియా గోవర్ధన్,గుడిబోయిన బిక్షం,గండు రామ్మూర్తి, ఈడబోయిన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.