Type Here to Get Search Results !

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.

అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే



నర్సింహులపేట, ఏప్రిల్ 25(నమస్తే న్యూస్)పడమటి గూడెం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాల్య విద్యను బలోపేతం చేసి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ సర్పంచ్ ఉప్పలయ్య తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటి గూడెం అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద నాగారం సెక్టర్ సూపర్వైజర్ మిడతపల్లి శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక బాల్య విద్య పూర్తి చేసిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాల కోసం పంపిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీశైలం, అంగన్వాడి టీచర్స్ శోభ, యాక లక్ష్మి, అంగన్వాడి హెల్పర్స్, ఎస్.కె పుతిలి,ఎలేంద్ర, కారోబర్ దేవేందర్, ప్రీస్కూల్ పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.