Type Here to Get Search Results !

మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పరస్పర అమలీల వాగ్వాద ఘర్షణ..!

మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పరస్పర హమాలీల వాగ్వాధం ఘర్షణ..!
రోజులు గడిచిన కాటా పెట్టరాయే...!



నర్సింహులపేట,ఏప్రిల్29 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.కొన్ని రోజులుగా హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, కొత్తగా మరికొందరు హమాలీలను తీసుకురావడంతో ఇప్పటికే పని చేస్తున్న హమాలీలతో వాగ్వాదం చోటుచేసుకుంది. “మీరు ఎలా పనిచేస్తారు?” అనే అంశంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తోరూరు సెకండ్ ఎస్సై ఖాదర్ పాషా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటన రైతుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని చూపిస్తోంది.సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు వస్తుంటాయి. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని హమాలీల సమస్యను, రైతుల ఇబ్బందులను త్వరగా పరిష్కరించడం అవసరమని స్థానికులు అన్నారు. 







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.