Type Here to Get Search Results !

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం.

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం.



నర్సింహులపేట, ఏప్రిల్ 26(నమస్తే న్యూస్)

'గురుదేవా..దీవించవా..‘మీ దరికి చేరామయ్యా..మమ్మల్ని కాపాడవయ్యా..'అంటూ భక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ప్రతి సంవత్సరం.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని  విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధనోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాగి యాకేంద్ర చార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం,మండపారాధనతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు,దక్షిణామూర్తి,నాగేశ్వర చారి,సోమ నరసయ్య చారి,రామచంద్రయ్య, బ్రహ్మచారి,రాజు,ప్రసాద్,విశ్వనాథం శేషు కుమార్, వీరితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.