ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. గూడూరు మండలం లక్ష్మి పురం గ్రామం లో ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో మోటార్ పడిపోయింది.ఈ క్రమంలో అజ్మీర బాలాజీ అనే వ్యక్తి అట్టి మోటార్ ను బయటికి తీస్తున్న క్రమంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ తగిలింది.దీంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు.గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

