వేసవి ‘జోష్’… కొలను లో ఈతకు వేళైంది...!
జాగ్రత్తలను విస్మరిస్తే ప్రమాదమే..!
నర్సింహులపేట, ఏప్రిల్ 29 (నమస్తే న్యూస్):
వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చల్లని వాతావరణం కోసం చిన్నా పెద్దలు నీటి కొలనుల వైపు మొగ్గు చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామంలోని గంగమ్మ తల్లి గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో గ్రామ ప్రజలకు వినోదంతో పాటు ఉపశమనం కలిగిస్తోంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈత కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు.అయితే, ఈత సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈత కొట్టాలని, ఈత రాని వారు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. భద్రతా చర్యలు పాటిస్తే వేసవి వేడిలో ఈత ఆరోగ్యానికి, వినోదానికి ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు పేర్కొన్నారు.


