◆మహిళలలకు బతుకమ్మ చీరెలు,గృహలక్ష్మీ పట్టాలను పంపిణీ చేసిన సర్పంచ్ యాదలక్షీ ,ఎంపీటీసీ మధురెడ్డి.
◆సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు అండగా ఉందాం.
◆కేసీఆర్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం.
◆మహిళల సమగ్ర అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం కృషి.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోబుట్టువు వలె బతుకమ్మ పండుగకు చీరలు కానుకగా పంపారని తెలంగాణ మహిళ లోకం కేసిఆర్ కు, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ కు అండగా నిలవాలని పడమటి గూడెం గ్రామ సర్పంచ్ జొన్నగడ్డల యాదలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీ పాతూరి మధురెడ్డి తో కలిసి గ్రామంలోని మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలను,మరియు గృహలక్ష్మీ లబ్ధిదారులకు మంజూరు అయిన పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే మహిళలకు సమాజంలో సముచిత గౌరవం దక్కిందని అన్నారు. బిడ్డ పుట్టిన నాటి నుండి కేసీఆర్ కిట్టును అందించి వారి ఎదుగుదలకు అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నారని అన్నారు. యువతుల వివాహానికి మేనమామ వలే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు లను అందించి ఆడపిల్ల వివాహానికి తల్లిదండ్రులకు కలిగే ఆర్థిక బారాన్ని తగ్గించారని కొనియాడారు. ప్రభుత్వం మహిళల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయల పంపిణీకి సైతం గృహలక్ష్మి అని మహిళల పేరు మీద పథకాన్ని ప్రారంభించడం మహిళల అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కేసిఆర్ రుణాన్ని తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి వార్డు సభ్యులు సైదులు, రామతార ,అనంతరెడ్డి ,ఎస్.కె అమీనా , గ్రామ పార్టీ అధ్యక్షులు చిమ్ముల వెంకటరెడ్డి, మాజీ అధ్యక్షులు దారం వేదయ్య , మాజీ సర్పంచ్ హెచ్ వెంకన్న, టిఆర్ఎస్ యూత్ విభాగం మండల ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం, జక్కుల యాకన్న నాయకులు జొనగడ్డ వెంకన్న, చిర్ర కృష్ణమూర్తి, రేషన్ డీలర్లు దారం నారాయణ, దాస రోజు జయమ్మ కరోబార్ హెచ్. దేవేందర్ ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



