ఘనంగా ప్రారంభమైన యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
నర్సింహులపేట, ఏప్రిల్ 28(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కపిలగిరిపై వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం గ్రామంలోని ఆలయం నుంచి స్వామివారి,చెంచులక్ష్మి,ఆదిలక్ష్మి ఉత్సవ విగ్రహాలను గజవాహనంపై కపిలగిరి గుట్టపై ఉన్న ఆలయానికి భక్తిశ్రద్ధలతో తీసుకెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు కుమారాచార్యులు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన పూజలు భక్తి వాతావరణాన్ని మరింత ఉద్ధీపింపజేశాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు.ఈ కల్యాణోత్సవాలు మరికొన్ని రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బండి రమేష్,ఏరా నాగి కిషోర్, శేషుకుమార్, ప్రేమ్కుమార్, యాకయ్య, యాకుబ్ రెడ్డి, క్రాంతి రెడ్డి, గ్రామస్థులు పలువురు దాతలు పాల్గొన్నారు.



