Type Here to Get Search Results !

నర్సింహులపేట మండల కేంద్రంలో నూతన సబ్ పోస్టాఫీసు ప్రారంభం సబ్ పోస్టాఫీసు సేవలు మండల ప్రజలు వినియోగించుకోవాలినరసింహ స్వామి పోస్టల్ సూపరింటెండెంట్ వరంగల్

నర్సింహులపేట మండల కేంద్రంలో నూతన సబ్ పోస్టాఫీస్ ను స్థానిక సర్పంచ్ వేముల రజిత రాంరెడ్డి తో కలిసి నరసింహ స్వామి పోస్టల్ సూపరింటెండెంట్ వరంగల్ డివిజన్ వారి చేతులమీదుగా ప్రారంభించారు
ఈసందర్భంగా నరసింహ స్వామి, తొర్రూరు పోస్టల్ సబ్ డివిజన్ అధికారి సైదా మాట్లాడుతూ సబ్ పోస్టాఫీసు సేవలు మండల ప్రజలు వినియోగించుకోవాలని
సబ్ పోస్టాఫీసులో సాధారణ, రిజిస్టర్డ్ మరియు స్పీడ్ పోస్ట్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, పోస్టల్ ATM కార్డ్, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, టైమ్ డిపాజిట్లు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పోస్టల్ సేవలను అందిస్తున్నామని, అంతే కాకుండా సీనియర్ సిటిజన్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ మరియు అప్‌డేషన్ మొదలైన సేవలను కూడా వినియోగించుకోవచ్చని 
ఉప తపాలా కార్యాలయంతో పింఛన్
దారులకు,ఉపాధి హామీ కూలీలకు, ఉత్తరాల బట్వాడకు మెరుగైన సేవలు
కోసం ఉపయోగ పడతాయి. ఈ ఉప తపాలా పరిధిలోని బ్రాంచి
కార్యాలయాల గ్రామాలు కొమ్ములవంచ, జయపురం, ముంగిమడుగు,
వంతడపల, పెద్దనాగారం, రాంపురం, చిల్లంచర్ల, ఉగ్గంపల్లి, ఎల్లంపేట
గ్రామాలు వస్తాయి అన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ రజిత మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సబ్ పోస్ట్ ఆఫీస్ గా అప్ గ్రేడ్ అవడం వలన మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోరారు 
ఈ కార్యక్రమంలో ఎంపీఓ సోమ్లాల్, డాక్టర్ సౌమ్యా, ఏపీఓ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ కర్ల నాగన్న, కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ రమేష్, ఖాజా మియా, పోస్టల్ సిబ్బంది చిల్ల మధు, మహేష్, సంతోష్, వెంకన్న ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.