అభివృద్ధి పనుల్లో ప్రభుత్వాన్ని తప్పుతోవపట్టిస్తూ సర్పంచ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు పై ప్రశ్నించినందుకు తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని నరసింహులపేట గ్రామ ఉపసర్పంచ్ కర్ల నాగన్న ఆరోపించారు. బుధవారం నర్సింహులపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపసర్పంచ్ మాట్లాడుతూ తమపై ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధిని అడ్డుకుంటున్నామని తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నారని అభివృద్ధిని అడ్డుకునే వారమైతే గతంలో లక్షలాది రూపాయల అభివృద్ధి పనులకు సంతకాలు చేసి ఉండకపోయే వారమని అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారమైతే రైతు వేదిక నిర్మాణంలో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడే ప్రయత్నం చేసినప్పుడే అడ్డుకునే వారమని , పల్లె ప్రకృతి వనాన్ని నీటిలో మునిగిపోతుందని తెలిసినా ,తీర్మానాలు లేకుండానే ఇష్టారీతిగా ఏర్పాటు చేశారని ,దానిపై జరిగిన నష్టాన్ని సైతం ఆధారాలతో సహా పంచాయతీ అధికారులకు అందజేశామని అన్నారు.ఎస్సీ హాస్టల్ విధ్యార్థులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,
హాస్టల్ దారిలో మురుగు నీరు బయటికి వెళ్ళే విధంగా మోరీలు ఏర్పాటు చేయాలని కోరామని ,దీనికి తాము చెయ్యమని కరాఖండిగా తేల్చి చెబుతున్నారని అన్నారు. ఎవరు అభివృద్ధి నిరోధకులో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపడితే బహిర్గతమవుతుందని ఉప సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆరెస్ యువజన విభాగం నాయకులు బండి రమేష్, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొండ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యులు మదార్, అలువాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తనపై కావాలనే బురదజల్లుతున్నారు...ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి-ఉప సర్పంచ్ కర్ల నాగన్న.
October 04, 2023
0
Tags
