◆నూతన ఓటర్ల జాబితాను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ శశాంక.
◆జిల్లాలో మొత్తం నమోదైన ఓటర్లు 4,59,901.
◆మానుకోట జిల్లా లో మహిళలలదే పై చేయి.
(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
జిల్లాలో నాలుగు లక్షల 59 వేల 901 ఓటర్లు తో నివేదిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
2,27,310 పురుష ఓటర్లు కాగా మహిళలు 2,32,530 మంది నమోదయినట్లు తెలిపారు .ఇతరులు 61 గా పేర్కొన్నారు.
కొత్తగా ఓటర్లు 22,862 నమోదు కాగా, తొలగింపబడినవి
10,325 ఉండగా ,సరిచేసిన ఓటరు నమోదు 11,258 ఉన్నాయన్నారు.జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్ నియోజక వర్గాల మండలాలలో 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.నేడు విడుదల చేసిన ఓటర్ల జాబితా నివేదికలో తమ ఓట్లు ఉన్నాయా లేవో ప్రజలు చూసుకోవాలని అన్నారు.



