నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామీణ యువతకు ఉపాదే లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భూపాల్ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ టికెట్ కేటాయించాలని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాందీ నాయక్ కాంగ్రెస్ అదిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం దంతాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.సామాజిక తెలంగాణ ఫ్రంట్ చైర్మన్ వెన్నపూజ పరశురాజ్,35 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపాల్ నాయక్ గెలుపుకై నియోజకవర్గంలో గడపగడపకు వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి భూపాల్ నాయక్ చేస్తున్న సేవలు ఎనలేనివని ,ఆయనకు అదిష్టానం డోర్నకల్ టికెట్ కెటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజల మనసుల్లో భూపాల్ నాయక్ డోర్నకల్ టికెట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని కాంగ్రెస్ పార్టీని కి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో. గాంధీ నాయక్ ,మహేష్ ,రాజు ,రాందాస్, సచిన్ నాయక్ ,అచ్యుతరావు ,సురేష్ వెంకన్న వెంకటేశ్వరరావు తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొని వాళ్ళ అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యక్తం చేశారు .

