◆కుమారున్ని ఎమ్మెల్యేను చేయడమే వారి లక్ష్యం...అందుకే అభివృద్ధి జపం.
◆నలభై ఏళ్ళ పాలనలో యువత 'ఉపాధి'కి తీసుకున్న చర్యలు శూన్యం.
◆ఉన్నత 'విధ్య'కై పక్క నియోజకవర్గాలకు వెళుతున్న విద్యార్థులు.
◆కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే.
(నమస్తే మానుకోట-మరిపెడ)
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ,డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తమ కుమారుల అభివృద్ధికి మాత్రమే పనిచేస్తున్నారని, సీఎం కెసిఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన కొడుకును ఎమ్మెల్యే ను చేయడానికి తపిస్తున్నారని, ప్రజల అభివృద్ధికి కాదని నియోజకవర్గ ప్రజలు గమనించాలని డోర్నకల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా సంగీత నాయక్ అన్నారు.మరిపెడ మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు సారథ్యం లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సంగీత నాయక్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా విద్య ,వైద్యం, ఉపాధిని పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఏ విధంగా కృషి చేస్తారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో జూనియర్ డిగ్రీ కళాశాలు లేక పక్క నియోజకవర్గాలకు ,పక్క జిల్లాలకు విద్యను అభ్యశించడానికి వెళ్తున్నారని, నియోజకవర్గంలో కనీసం ఏ మండల కేంద్రంలో కూడా వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయలేకపోయారని అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినా ఉపాధి లేక యువత, కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 40 సంవత్సరాలు నెత్తిన పెట్టుకున్న డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు కరోనాతో విలవిలలాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించలేకపోయారని , పైగా తనని కలవడానికి ఎవరూ రావద్దని ఆదేశించారని డోర్నకల్ నియోజకవర్గం ప్రజలపై ఎమ్మెల్యేకు ఉన్న ప్రేమ ఎంతో అర్థం చేసుకోవచ్చనని అన్నారు . గతంలో కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన కుమారుని ఎమ్మెల్యేగా చేయడమే లక్ష్యమని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ అభివృద్ధి పేరుతో మళ్లీ తనకు ఓటు వేయమని అడుగుతున్నారని ,40 ఏళ్ళలో చేయలేని అభివృద్ధి కొత్తగా చేసేది ఏమీ లేదని ప్రజలు గమనించాలని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపా పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని , ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్నదని, డోర్నకల్ నియోజకవర్గంలో భాజపా పాలన వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు విద్యా ,వైధ్యం,ఉపాధి అందుతాయని , డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు బాజాపాను ఆదరించాలని, కషాయ జెండా ను ఎగిరే విధంగా కృషి చేయాలని వేడుకున్నారు.కార్యక్రమం ముఖ్యఅతిథి గోపీనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ కర్ణాటక జిల్లా ఇన్చార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు మహబూబాబాద్ పార్లమెంట్ ప్రబారి నూకల వెంకట్ నారాయణరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ ముసుకు శ్రీనివాస్ రెడ్డి బిజెపి అభ్యర్థి భూక్య సంగీత జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ డోర్నకల్ అసెంబ్లీ కన్వీనర్ తాడ పూర్ణచందర్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గం ప్రబారి పాకనాటి దామోదర్ రెడ్డి రంజిత్ రావు పార్లమెంట్ కో కన్వీనర్ సింగారం సతీష్ మండలాల అధ్యక్షులు పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.



