◆నాలాగా సేవ చేసే నాయకుడు రాష్ట్రంలో ఎక్కడ దొరకడు.
◆మీరే ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లుగా భావించి కష్టపడి పని చేయాలి.
◆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి.
◆ క్షేత్రస్థాయి నాయకులు పొరపచ్చాలు లేకుండా కలిసి పని చేయాలి.
◆మీకు సేవచేసి మీ హృదయాల్లో నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకుంటా..!
![]() |
| ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ |
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
తెలంగాణ రాష్ట్రం లో నాలాగ సేవచేసి వ్యక్తి ఎక్కడి కి వెళ్ళి వెతికినా దొరకడని,ఈ ఒక్కసారి ఓటు వేసి గెలిపిస్తే ఈ ఐదేళ్లు మీకు సేవచేసి మి హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని కల్పించుకుని ,నా కుటుంబానికి భవిష్యత్ ఉండే విధంగా ఉంటానని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం దంతాలపల్లి,నర్సింహులపేట మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తామే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని భావించి పనిచేయాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని, ఇతర పార్టీల నాయకులు తమకంటే ఎక్కువ బలవంతులుగా భావించి పని చేయాలని ,వారిని తక్కువ అంచనా వేయవద్దని నాయకులకు ,ప్రజాప్రతినిధులకు ,ముఖ్య కార్యకర్తలకు సూచించారు.ఓటర్లను ఒకటికి రెండుసార్లు కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని అన్నారు.స్థానిక నాయకులు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా బూత్ ల వారిగా కమిటీ లు వేసుకుని కలిసి పని చేయాలని అన్నారు.ఈ ఎన్నికల్లో గెలిస్తేనే మీరంతా సుఖశాంతులతో ఉంటారని అన్నారు.రెడ్యానాయక్ గెలిస్తే మీరంతా ఎమ్మెల్యే లే...మీ పనులు పోను చేస్తే పూర్తవుతాయని,నేనొక్కడిని గెలిస్తే మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గరుండి గెలిపిస్తానని హామీ ఇచ్చారు.మన పార్టీ అధికారంలో ఉంటే,నాయకులందరికీ సముచిత గౌరవం ఉంటుందని బూత్ స్థాయిలో కమిటీలు వేసి ప్రతి ఓటరును ఓటు వేయమని అభ్యర్థించాలని అన్నారు.నర్సింహులపేట మండలం నుంచి నాలుగు నుంచి ఐదువేల మెజారిటీ ఇవ్వాలని కోరారు.నాయకులు నిర్లక్ష్యంగా ఉండవద్దని ,ఎదుటి వారిని తక్కువ అంచనా వేయవద్దని ప్రచారంలో అలసత్వం ప్రదర్శించవద్దని ఎన్నికల మానిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి నియోజకవర్గం తనకు దేవాలయమని, ప్రజలు దేవుళ్ళని తనను గెలిపిస్తే రాబోయే ఐదేళ్లు సేవ చేసుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, టేకుల యాదగిరి రెడ్డి, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ధర్మాలపు వేణు, మైదం దేవేందర్ ,దంతాలపల్లి రైతుబంధు సమితి మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము, బిక్షం రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



