ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) మానుకోట పట్టణ అధ్యక్షులుగా తేజావత్ శ్రీనివాస్ నాయక్ ను ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లావుడియా రాము నాయక్ ఏకగ్రీవంగా నియమించారు. మహబూబాబాద్ మండలంలోని మాదాపురం శివారు తేజావత్ శ్రీనివాస్ నాయక్ ట్రైబల్ జర్నలిస్టుల కోసం గత కొన్ని నెలలుగా కృషి చేస్తున్నందున ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఇటీవలే టీటీడబ్ల్యుజేఏ సంఘానికి అధికారికంగా రాజీనామా చేసి ఆ సంఘం యొక్క విధానాలు నచ్చక, టిడబ్ల్యూజేఏ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై బుధవారం టీడబ్ల్యూజెఏ సంఘంలో అధికారికంగా చేరి తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వారిని టీడబ్ల్యూ జేఏ జిల్లా అధ్యక్షులు తేజావత్ రవి నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మణ్ నాయక్, జిల్లా లీగల్ అడ్వైజర్ భూక్య మోహన్ నాయక్ లు నియామక పత్రాన్ని అందజేసి సాధారంగా ఆహ్వానించారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను వమ్ము చేయకుండా సంఘం నిబంధనల మేరకు బాధ్యత యుతంగా నడుచుకుంటానని, మరియు ట్రైబల్ జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు.
టిడబ్ల్యూజేఏ మానుకోట పట్టణ అధ్యక్షులుగా శ్రీనివాస్ నాయక్.
October 04, 2023
0
Tags
