![]() |
| భూపాల్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని కోరుతున్న మహిళలు, అభిమానులు |
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే కాంగ్రెస్ కు డోర్నకల్ గడ్డ మీద పూర్వ వైభవం రావాలంటే నూనావత్ భూపాల్ నాయక్ కే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ కర్నావత్ గాంధీ నాయక్ కోరారు.ఈ సందర్భంగా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం కరపత్రాలను ఆవిష్కరించి'ఆడబిడ్డల వేడుకోలు' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను అ నానావత్ భూపాల్ నాయక్ కే ఇవ్వాలని మండలానికి చెందిన మహిళలు కాంగ్రెస్ పార్టీ అదిష్టానాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా గాంధీ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే కాంగ్రెస్ కు డోర్నకల్ గడ్డ మీద పూర్వ వైభవం రావాలంటే నూనావత్ భూపాల్ నాయక్ కే టికెట్ కేటాయించాలని అన్నారు. భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని, భూపాల్ నాయక్ పేద కుటుంబం నుండి కష్టపడి ఎదిగి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రజల కష్టాలు తెలిసినవాడని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే,కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కచ్చితంగా పార్టీ అధిష్టానం అందరూ ఆలోచించి భూపాల్ నాయక్ టికెట్ ఇవ్వాలని అన్నారు.అదే విధంగా దశాబ్దాల కాలం నుండి డోర్నకల్ ప్రాంతం వెనుకబడిందని, 30 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం అని అని ఎద్దేవా చేశారు. తన స్వంత ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం,ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్న డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు భూపాల్ నాయక్ లాంటి వ్యక్తి దొరకడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్యుత్ రావు, మండల ఇంచార్జ్ గణేష్,భూపాల్ నాయక్ అనుచరులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


