(నమస్తే మానుకోట-చిన్నగూడూరు)
బిజెపి పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని,ఈ ఎన్నికల్లో ఓటువేసి గెలిపించాలని ,మీ కష్టాల్లో బిడ్డలా తోడు ఉంటానని డోర్నకల్ భాజపా అభ్యర్థిని భూక్య సంగీతనాయక్ ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగీత నాయక్ మంగళవారం చిన్నగూడూరు మండలంలో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఱ ప్రజలతో మమేకమై వారి కష్టాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న మహిళలతో సంగీత నాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, కష్టాల్లో తమను బిడ్డగా అండగా ఉండి ఆదుకుంటానని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గం లోని అన్ని వర్గాల అభివృద్ధి కేవలం ప్రజల కోసం పనిచేసే భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజాపా పాలనలోనే సాధ్యమవుతుందని, నియోజకవర్గంలో విద్యా వైద్యం ఉపాధి కలగాలంటే భాజపా అధికారంలోకి రావాలని ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి,ఎమ్మెల్యేగా గెలిపించి, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు ,మండల అధ్యక్షుడు బోయిని యాకన్న ,జక్కి యాకసాయిలు,చిలువేరు కరుణాకర్ ,వేణు,మాచర్ల దేవేందర్,గనగాణి వేణు,మధు తదితరులు పాల్గొన్నారు.



