అన్ని వర్గాల ప్రజలకు సముచిత గౌరవం కలిగేలా సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మారుమూల పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం పీడ వస్తువులను అందజేస్తుందని మహిళలకు తోబుట్టువు లాగా బతుకమ్మ చీరలను కానుకలుగా ఇస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలను మరియు తెలంగాణ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ,వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ ,డీఈ ఉపేందర్ , చిట్యాల జనార్ధన్ , గద్దె రవి , గోగుల రాజు , కర్పూరపు పద్మ,, దండెబోయిన వెంకన్న , విజయమ్మ , మార్నేని రఘు , బోనగిరి గంగాధర్ , శివకుమార్ , జన్ను మహేందర్ ,మెప్మా డిఎంసి విజయ , మెప్మా ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు బతుకమ్మ చీరెలు,యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.
October 04, 2023
0
Tags
