కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్ మరియు డోర్నకల్ ఇంఛార్జి గుగులోతు సూర్య ప్రకాష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా
డోర్నకల్ లో 7 వ రోజు చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె కు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దాంతో విద్యార్థులు మధ్యాహ్నం పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.గత సంవత్సరం నుండి రావాల్సిన పెండింగ్ బిల్లులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా ఇటు విద్యార్థుల జీవితాలతో ,అటు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు .తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్మికులను,విద్యార్థులను సమీకరించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు
చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ల్లా.ఎఫ్.ఐ సహాయ కార్యదర్శి సింహాద్రి,సిఐటియు నాయకురాలు ధనలక్ష్మి కార్మికులు పాల్గొన్నారు.
