సీఎం కేసీఒఇయధథత్య్రదఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ పాలనలో మాత్రమే మారుమూల తండాలు పల్లెలు పట్టణాలను తలపించే విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లు అన్నారు ఈ సందర్భంగా బుధవారం నెల్లికుదుర్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు . ఈ సందర్భంగా రత్తిరాం తండా గ్రామంలో 262.50 లక్షల రూపాయలతో హనుమాన్ తండా నుండి తౌర్య తండా వయా ఆవులేగా తండా వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు, కాచికల్ గ్రామంలో 187.50 లక్షల రూపాయలతో గిల్యా తండా నుండి రత్తిరాం తండా వయా తిమ్య తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు మరియు రత్తిరాం గ్రామపంచాయతీ పరిధిలో 80.00 లక్షల రూ.లతో ఆర్ &బి రోడ్డు నుండి కునాయకుంట తండా తండా వరకు బి.టి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.అనంతరం దసరా పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను,యువకులకు స్పోర్ట్స్ కిట్స్ లను పంపిణీ చేసారు. మరియు అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మీ పట్టాలను అందించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు,జిల్లా రైతు బంధు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల గ్రామ భారాస నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
