సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన గిరిజన హామీ ని తక్షణమే అమలు చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్ వెంకన్న నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మానుకోట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ప్రాంతంలో, ఏర్పాటు చేసిన సేవాలాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకన్న నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంజారా భవన్,గిరిజన భవన్, ఆవిర్భావ సభలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు గిరిజన బందును ప్రకటించి అమలు చేస్తామని హామీ ఇచ్చారని అట్టి హామీ ఇప్పటికీ సంవత్సరకాలం పూర్తి కావస్తున్న ఇప్పటివరకు గిరిజన బంధు పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. దీనిని సేవాలాల్ సేన తీవ్రంగా ఖండిస్తున్నదని ముఖ్యమంత్రి వెంటనే గిరిజన బందును ప్రకటించి అమలు చేయాలని, లేని పక్షాన సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అన్ని కులాలకు సముచిత న్యాయం కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మరి గిరిజనులకు ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. దీనిని గిరిజన ప్రజాప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లి,అమలు చేసేలా చూడాలని, లేనిపక్షంలో రేపు జరగబోయే ఎలక్షన్లలో గిరిజనులందరూ తిరగబడతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన మానుకోట జిల్లా అధ్యక్షులు గుగులోత్ నందులాల్ నాయక్, జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాధావత్ రాంబాబు నాయక్, జిల్లా అధికార ప్రతినిధి మాలోత్ సురేష్ నాయక్, కార్మిక సేన జిల్లా నాయకులు భూక్య శంకర్ నాయక్ ,రైతు సేన జిల్లా కార్యదర్శి బానోత్ జేతురాం నాయక్ ,కేసముద్రం మండల అధ్యక్షులు బానోత్ నరేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
గిరిజన బంధును వెంటనే ప్రకటించి అమలు చేయాలి-సేవాలాల్ సేన.
October 03, 2023
0
Tags
