పాయం'మృతి విప్లవోద్యమానికి తీరని లోటని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఆదివాసి ముద్దుబిడ్డ టేకులగూడెం మాజీ సర్పంచ్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సీనియర్ నాయకులు కామ్రేడ్ పాయం నారాయణ మృతి పట్ల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బయ్యారం సబ్ డివిజన్ కమిటీ విచారాన్ని వ్యక్తం చేసింది. కామ్రేడ్ లక్ష్మీనారాయణకు విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపింది.కామ్రేడ్ లక్ష్మీనారాయణ చిన్నతనము నుండే విప్లవద్యమాలకు ఆకర్షితుడై నాటినుండి నేటి వరకు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని క్రియాశీలక పాత్రను పోషించాడని అన్నారు. కామ్రేడ్ లక్ష్మీనారాయణ మృతి వారి కుటుంబానికి కాకుండా ఇల్లందు నియోజకవర్గ విప్లవద్యమాలకు తీరని లోటుగా భావిస్తున్నామన్నారు.
