◆8 ఏళ్లుగా 'తలసేమియా వ్యాధి'తో నరకయాతన పడుతున్న బాలుడు.
◆ఆపరేషన్‌కు రూ.20 లక్షలు అవసరమవుతాయన్న వైద్యులు.
◆వైద్యానికి డబ్బు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు.
◆మనసున్న మారాజులు ఆదుకోవాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన ఓ బాలుడు రక్తదాహానికి మారుపేరైన తలసేమియా వ్యాధి పట్టి పీడిస్తోంది.పుట్టిన 3నెలల నుండి ఇప్పటి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటూ కొడుకును కాపాడుకునేందుకు తల్లడిల్లుతున్నారు.మారాజులు మంచి మనస్సు చేసుకొని ఆపన్నహస్తం అందించి తమ కుమారుని వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని తల్లితండ్రులు కోరుతున్న ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం,వస్రాం తండ గ్రామ పంచాయితి శివారు గాంగ్య తండాలో చోటుచేసుకుంది.
ఇదే తండాకు చెందిన గుగులోతు రమేష్,లక్ష్మి దంపతులకు వీక్షిత్ అనే ఎనిమిది సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు.పుట్టిన మూడు నెలల తర్వాత బాలుడు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులకు చూపించారు.తరచూ రక్తం అవసరమయ్యే తలసేమియా అనే వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.ఆపరేషన్‌కు రూ.20 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారని,మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి తమ కోడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు.ఖాతా నంబర్ 32261317809
ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ SBIN0005652,ఫోన్ పే/గూగుల్ పే 9441003114.
