Type Here to Get Search Results !

జర్నలిస్టులకు పట్టిష్టమైన రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలి - టి.యు డబ్ల్యు.జె(ఐజెయూ) జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి.

జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛపై  తమ  నిరంకుశత్వాన్ని కొనసాగిస్తున్నాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు చిమ్ముల సాయి రెడ్డి ,నరసింహులపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండాబత్తిని రవికుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఐజెయు జాతీయ కమిటీ ఆగస్టు 26, 27 తేదీలలో పాట్నాలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం నరసింహులపేట మండల కేంద్రంలో అక్టోబర్ 2 ను డిమాండ్స్ డే గా పరిగణించి నిరసన వ్యక్తం చేసి, మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ కౌన్సిల్ నేడు డిజిటల్ మీడియా లో వచ్చిన మార్పుల కనుగుణంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించలేకపోతుందని, డిజిటల్ మీడియాకు నిర్ణీతమైన విధివిధానాలు చట్టబద్ధత లేక పోవడమే కాకుండా జర్నలిస్టులకు రక్షణ కరువైందని ,తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని , జర్నలిస్టులకు పటిష్టమైన రక్షణ చట్టాలను తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని,అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని డిమాండ్  చేసారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సిలువేరు ఉపేందర్, కల్లెడ మధు, రేఖ ఉపేందర్, చిదిమిల్ల గణేష్, నిమ్మల నరేష్, గుగులోతు రమేష్, బానోతు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.