మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోలుపాడు గ్రామానికి చెందిన గంధం వెంకటయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు మాలోతు నెహ్రూ నాయక్ ,కొండపల్లి రఘురాం రెడ్డి సారథ్యంలో
మన్నెగుడెం గ్రామ పార్టీ అధ్యక్షులు మడికంటి నర్సయ్య
వారి స్వగృహనికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో
మృతుని కుటుంబసభ్యులకు ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటయ్య మరణం వారి కుటుంబానికి తీరని లోటని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నియోజకవర్గం లో చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటూ సహాయ సహకారాలు చేస్తున్న నెహ్రూ నాయక్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.నాయకులు గంధం గోపి,సైదులు,గంధం బాబు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
