మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల,రామానుజపురం,గున్నెపల్లి, ఆగాపేట, గ్రామాలలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు శుక్రవారం డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి,సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి చేరాయని, ప్రతి ఒక్కరు నియోజకవర్గం అభివృద్ధిని చూసి తమ ఓటును బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో రెడ్యానాయక్ ను గెలిపించాలని కోరారు. పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఉపయోగపడుతుందని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కార్డు ఓల్దర్కు సన్న బియ్యం, గ్యాస్ రు 4వందలకు,పెన్షన్ పెంపు, కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రతి ఇంటికి మేనిఫెస్టో గురించి తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.ప్రతి కార్యకర్త బిఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలు గడప గడప కు వివరించి గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం దేవాలయంగా,నియోజకవర్గ ప్రజలను దేవుళ్లుగా చూస్తున్న ,ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి రెడ్యానాయక్ అన్నారు. ఆయనకు తప్ప ఎవరికీ ఓటు అడిగే అర్హత లేదన్నారు.రెడ్యానాయక్ గెలుపు ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ధర్మారపు వేణు, నూకల గౌతమ్ రెడ్డి, వీరబోయిన కిషోర్, నాగిరెడ్డి వెంకట్రెడ్డి,గడ్డం వెంకన్న, తండ రాములు, రాచకొండ రామ్మూర్తి, మంగి రామ్మూర్తి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మద్దిరాల వీరాస్వామి, గుండె రామనర్సయ్య, పార్టీలో చేరిన వారు ఎరుకొండ సోమయ్య, ఉప్పలయ్య, కామ పరమేష్, పరశురాములు ,బొడ్డు మల్లయ్య, మల్లయ్య, జనార్ధన్,తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం-ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్.
October 20, 2023
0
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
Tags


