Type Here to Get Search Results !

సామాన్యులను విస్మరించిన బిఆర్ఎస్ ప్రభుత్వం-పడమటి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలయ్య.

సామాన్య పేద ,మధ్యతరగతి ప్రజలను మరిచి ,కేవలం తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే  సంక్షేమ పథకాలు ఇస్తామనడం 
అవివేకమని పేద మధ్యతరగతి ప్రజలను  మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పడమటి గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల ఉప్పలయ్య యాదవ్ అన్నారు.ఆదివారం బూత్ స్థాయి సమీక్ష సమావేశం గ్రామంలోని రామన్న ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడుతూ గ్రామాలలో సైతం బిఆర్ఎస్ పార్టీ ఆగడాలు మితిమీరి పోయాయని సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న రెడ్య నాయక్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అనడం ఏమిటని వారు ప్రశ్నించారు. గ్రామాలలో అధికార పార్టీ వర్గాలుగా విడిపోయి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. కొంతమంది పడమటి గూడెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ పథకం ఇవ్వమని మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కుదరదు అనడం సిగ్గుచేటని అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల వద్ద ఎలాంటి పన్నులు వసూలు చేయవద్దని పథకాలు ఇచ్చిన వారి వద్ద మాత్రమే ఓట్లు అడగాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. పడమటి గూడెం గ్రామంలో బిసి బందు మరియు ఇండ్ల విషయంలో అధికార పార్టీ నాయకులకు మాత్రమే వారి పేర్లు మాత్రమే వచ్చాయని నిరుపేదలను మరిచారని వారు తెలిపారు. వికలాంగులకు బీసీ సంక్షేమ పథకం లక్ష రూపాయలు లబ్ధి చేకూరలేదని, ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేసిన గతంలో కట్టుకున్న వారికి కూడా లిస్టులో పేరు రావడం ఏంటి అని వారన్నారు. గ్రామంలో వర్గాలతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని అధికార పార్టీ నాయకులు ఇష్టాను రీతిగా వ్యవహరిస్తున్నారని ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వం చరిత్రలో నిలిచిన దాఖలు లేవని సరైన సమయంలో ఓటర్లు స్పందించాలని వారు కోరారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను అందిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంటెస్టెడ్ ఎంపీటీసీ మహిపాల్ రెడ్డి వార్డు సభ్యులు ప్రతాపరెడ్డి సతీష్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు చిర్ర ఉపేందర్ గౌడ్ గ్రామ పార్టీ సహాయ కార్యదర్శి దసరోజు కనకాచారి గ్రామ ఉపాధ్యక్షులు ఆరునుర్ల రాములు పార్టీ ఆర్గనైజింగ్ ఇంచార్జ్ సతీష్ గౌడ్ చిర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.