డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంటి పాలేరు లాగా సేవ చేస్తున్నారని,కన్న బిడ్డలకంటే ఎక్కువగా ,నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని , రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రెడ్యానాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు.ఆదివారం నర్సింహులపేట మండలంలోని
గోపాతండ, పెద్దనాగారం, నర్సింహులపేట,కొమ్ములవంచ రూప్లా తండా,గోల్ బోడ్కా తండా, నరసింహపురం బంజర, బక్క తండ, బాసుతండా ,ముంగిమడుగు తదితర గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కవిత మాట్లాడుతూ
ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అడిగిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మరిపెడ మండల కేంద్రానికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని, నర్సింహులపేట మండల ప్రజల కోరిక మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించి ఆపద సమయంలో అవసరమైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేశారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు.
దొంగలొచ్చే సమయమాసన్నమైంది.. మోసపోవద్దు.!
ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి దొంగలు వచ్చే సమయమైందని అన్నీ ఉచితాలంటూ మభ్యపెడుతారని ప్రజలు వారి మాటలు నమ్మిమోసపోవద్దని,వారి మాయలో పడితే ఇబ్బందులు పడుతారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు.సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్తు , రైతుబంధు, రైతు బీమా, వ్యాది గ్రస్తులకు ,ఒంటరి మహిళలకు,వికలాంగులకు, వృధ్ధులకు-ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి -షాదీ ముభారక్ , కెసిఆర్ కిట్టు ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తద్వారా ప్రజలు ఆర్థిక అభివృద్ధిని సాధించి ఆనందంగా ఉన్నారని ఎంపీ అన్నారు.ఓటువేయాలని అడిగే కాంగ్రెస్ పార్టీల నాయకులను ఏమిచ్చారని ప్రశ్నించాలని ఎంపి కవిత అన్నారు.
డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి 200కోట్లు మంజూరు చేయించాం-ఎమ్మెల్యే రెడ్యానాయక్.
నర్సింహులపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ వేముల రజిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ నర్సింహులపేట మండల కేంద్రానికి పి.హెచ్.సి కి రూ 1.2 కోట్లు,లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రూ 1.2 కోట్లు,సీ.సీ రోడ్లకు రూ.50లక్షలు రూలతో శంకుస్థాపన చేసుకుని ఎన్నో ఏండ్ల సమస్యను పరిష్కరించుకున్నామని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు.ఆగస్టు నెలలో సీఎం కేసీఆర్ ను కలిసి 200కోట్ల రూ.ల అబివృద్ది పనులను మంజూరు చేయించుకోగలిగామని అన్నారు.డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మూడవసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి ని చేయాలని ,ప్రజలందరి అభిమానం ,ఆశీర్వాదం కావాలని బిఆరెస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
గృహలక్ష్మీ లబ్దిదారులకు మంజూరీ పత్రాలను అంజేసిన ఎంపీ .
నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంలో భాగంగా సొంత ఇంటి స్థలాలు ఉన్నా నిరుపేదలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ లక్ష్మీ పథకంలో భాగంగా ఇటీవ నర్సింహులపేట మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై మండల అధికారులు సర్వే జరిపించి అర్హులను ఎంపిక చేశారు. నేపథ్యంలో మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత,ఎమ్మెల్యే రెడ్యానాయక్ తో కలిసి మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరి రెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్ , మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్,సీనియర్ నాయకులు ఖాజామియా, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మెరుగు శంకర్ , మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్, స్థానిక సర్పంచ్ వేముల రజిత,నాయకులు కాలసాని దామోదర్ రెడ్డి, తహసీల్దారు వివేక్, ఎంపీడీవో భారతి, ఎంపీఓ సోమ్ లాల్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్, వైద్య సిబ్బంది, మండల యూత్ నాయకులు మంచాల శ్రీశైలం, సురేష్ నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మారపంగ వీరన్న, పట్టణ అధ్యక్షుడు జగదీశ్వర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు సాత్విక్, ఉపేందర్ రెడ్డి, మురళి, మౌనిక , అధికారులు తదితరులు పాల్గొన్నారు.
