Type Here to Get Search Results !

నవరాత్రి ఉత్సవాలకు 50 వేల రూ.ల విరాళం అందజేసిన భూపాల్ నాయక్.

(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

 నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అషైశ్వర్యాలు కలిగి ఉండాలని కిసాన్ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు ననావత్ భూపాల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వారి పూజలకు 50 వేల రూపాయలు విరాళంగా భూపాల్ నాయక్ ఆదివారం అందజేశారు.ఈ సందర్భంగా కిసాన్ పరివార్ అధినేత ననావత్ భూపాల్ నాయక్ మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో ఆ దుర్గామాత ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, దాంతోపాటు ప్రజల ఆశీర్వాదాలు కూడా కావాలని భూపాల్ నాయక్ అన్నారు.ఈ ప్రాంతం అభివృద్దే నా లక్ష్యం అని , దశాబ్ద కాలంగా వెనుకబడి ఉన్న ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి వచ్చానని తెలిపారు... ఈ కార్యక్రమంలో భూపాల్ నాయక్ టీమ్ అచ్యుత్ రావ్,శివన్న,పరుశురాం,రంగన్న గౌడ్,భీమా నాయక్ ,వాసు నాయక్,గాంధీనాయక్,ఎదెల్లివెంకన్న

,ప్రకాష్,రామ్మూర్తి,వెంకటరమణ,హరిబాబూ,రాందాస్,భగత్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.