Type Here to Get Search Results !

అంగన్వాడీల కడుపు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం-డా.రాంచంద్రునాయక్.

అంగన్వాడీల కు అండగా ఉంటాం-కాంగ్రెస్

అంగన్వాడిల సమ్మెకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు.

◆అంగన్వాడీ ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.

◆డెబ్బై వేల మంది అంగన్వాడీల కడుపు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

(నమస్తే మానుకోట-దంతాలపల్లి)


 తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న మూడవరోజు నిరవధిక సమ్మెలో భాగంగా దంతాలపల్లి మండల కేంద్రంలో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రామచంద్రనాయక్ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ నిరవధిక సమ్మెకు మద్దతుగా బుధవారం పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులు పని చేస్తున్న వారంతా మహిళలు, బడుగు బలహీన వర్గాల దళితులు, పేదలేనని ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్నారని, వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేదని అన్నారు, మధ్యకాలంలో రాష్ట్ర అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,వారికి కానీస వేతనం26వేలు ఇవ్వాలని అన్నారు వారికి కేద్రం ప్రకటంచిన అలెవెన్సు కూడా ఇవ్వకుండా రాష్ట్రప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు,నిధులను దారిమల్లిస్తున్నదని అన్నారు,అంగన్వాడీల కు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు,రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ రెడ్యానాయక్ లను బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ని అధిక మెజారిటీ తో గెలిపించాలని అన్నారు కాంగ్రెస్ అధికారం లోకి వస్తే మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టు నాయక్,దంతాలపల్లి ఎంపిటీసి నెమ్మది యకయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, నాయకులు తండా రాములు,ప్రసన్న కుమార్,అంగన్వాడీలు అధ్యక్షులు అనుమండ్ల రమాదేవి,ధర్మారాపు విజయ,మంజుల,హెల్పర్స్ పంతం వెంకటలక్ష్మి,బుర్ర ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


అంగన్వాడీల కు అండగా ఉంటాం(వీడియో)-కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జి డా.రాంచంద్రునాయక్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.