Type Here to Get Search Results !

పాదాచారున్ని ఢీకొట్టిన లారీ...వ్యక్తి మృతి.

(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం భీరిశెట్టిగూడెం గ్రామ శివారు లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గున్నెపల్లి గ్రామానికి చెందిన టేకుల బక్కయ్య (70) అను వ్యక్తి ని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.గమనించిన స్థానికులు హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమద్యలో మృతిచెందినట్లు గా ్థానికులు  తెలిపారు.
మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన బిఆరెస్ పార్టీ బహిరంగ సభకు వెళ్ళి వస్తుండగా తిరుగు ప్రయాణంలో వృక్షం డెవలపర్స్ కు చెందిన వెంచర్ వద్ద ఆగి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం  చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ ఘటనతో గున్నెపల్లి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.