(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు ఈ సందర్భంగా బుధవారం దంతాలపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భట్టూ నాయక్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి పీసీసీ సభ్యులు డా,,రాంచందర్ నాయక్ పాల్గొని
బూత్ స్థాయిలో కమిటి నిర్మాణాన్ని పటిష్టపరిచి
గడప గడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రతి గ్రామం లో పర్యటించాలని ,గ్రామాల వారీగా కమిటిలు - క్లస్టర్ ఇంచార్జిల నియామకం చేసి పార్టీ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ కార్యక్రమంలో దంతాలపల్లి ఎంపీటీసీ నెమ్మది యాకయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్,బీ
సీ సెల్ అధ్యక్షులు తండా రాములు,జిల్లా నాయకులు గురుపాల్ రెడ్డి ,మండల నాయకులు మద్దుల రామిరెడ్డి, యూత్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొడుపుగంటి హరికృష్ణ ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురికి అనిల్ ,రూరల్ అధ్యక్షులు ఆవుల సురేష్ మరియు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు బిఎల్ ఏ లు పాల్గొన్నారు.