నమస్తే మానుకోటా న్యూస్ :-
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం సర్దార్ కాన్వాయి గూడెంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని సామాన్య కుటుంబం లో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి అని నిజాం పాలన పై తిరుగుబాటు చేసి, ఆ పాలన పై యుద్ధం ప్రకటించారు.ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం
ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి అందుకే సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు. హైదరాబాద్ లో 5 ఎకరాల స్థలం లో సర్వాయి పాపన్న పేరుతో ఒక భవనం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
వైన్ షాపుల్లో ప్రభుత్వం 15శాతం రిజర్వేషన్లు కల్పించారని గౌడలు అన్ని రంగాల్లో ముందున్నారని పాపన్న పేరు నిలిపే విధంగా గౌడల పనితీరు ఉందని మీ పిల్లలను బాగా చదివించుకోవాలని, మీ పిల్లలు మీరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం దేశం బాగుపడుతుందని గౌడలకు అభినందనలు! శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
