తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి లో మరింతగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్పను వేడుకున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో ప్రత్యేక పడిపూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.
మూడోసారి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని, మానుకోట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఎల్లవేళలా వారికి అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
