ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఎల్ విజయ్కాంత్, జిల్లా మహిళా కన్వీనర్ తప్పేట్ల కృష్ణవేణి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసంపల్లి ఉపేందర్ జిల్లా కార్యదర్శులు దారా ప్రసాదరావు, పాల్వయి బుచ్చి రాములు,జిల్లా జింక లక్ష్మణ్ జిల్లా ఈసీ నెంబర్ తప్పెట్ల చాణక్య,అసెంబ్లీ ఉపాధ్యక్షులు, వీ రేవంత్, కార్యదర్శి సీత సాయి కిరణ్,తదితరులు పాల్గొన్నారు
పాపన్న స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధిస్తాం బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్
August 18, 2023
0
సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధిస్తాం అని దార్ల శివరాజ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బిఎస్పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతిని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల. శివరాజ్ మాట్లాడుతూ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలా షాపూర్ను బహుజన సామ్రాజ్యముగా ఏర్పాటు చేసుకొని పాలించాడు. అణగారిన కులాలను ఏకం చేసి చైతన్యపరిచి దొరల పెత్తందారి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన మొదటి బహుజన రాజు సర్వార్ సర్దార్ పాపన్న గౌడ్ అని ఆయన అన్నారు. అదేవిధంగా నేడు తెలంగాణలో దొరల పరిపాలన అంతం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వి ఆర్ ఎస్ అడిషనల్ డీజీపీ కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. బహుజనుల అభివృద్ధి జరగాలంటే ఎస్సీ ఎస్టీ బిసి మత మైనారిటీ ఏనుగు గుర్తుకు ఓటేసి బహుజన వాదాన్ని బలపరచాలని ఆయన కోరారు.
Tags
