దేశం పత్రిక స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన తొలి కలం వీరుడు షోయబుల్లాఖాన్ వర్థంతి వేడుకలను మంగళవారం గార్లలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నెహ్రూ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద షోయబుల్లాఖాన్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించి పత్రిక స్వేచ్ఛ కాపాడేందుకు సాగించిన పోరాటా పటిమలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీ యు డబ్ల్యూ జె ఐజెయు మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బుడాన్, సంఘం సభ్యులు నేలం శ్రీనివాస్, రూపన్ శంకర్, కృష్ణ కుమార్, మాదా శ్రీకాంత్, ఈశ్వర లింగం, వజ్రం నాగేశ్వరరావు, జంపాల విశ్వ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి ఖదీర్ బాబా, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ పానుగంటి రాధాకృష్ణ, బి ఆర్ ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం డి షఫీ, మెరుగు వినోద,ఏసుమళ్ళ రాజశేఖర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
