◆ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకుని వెళ్ళాలి.
-బిజెపి ఎమ్మెల్యే భూదాన్ ముర్ము.
◆డోర్నకల్ లో కాషాయ జెండా ను ఎగురవేస్తాం.
- బానోత్ ప్రభాస్ నాయక్.
రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని గడపగడపకు తీసుకెళ్లి ,డోర్నకల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ను ఎగురవేసే విధంగా పార్టీ బలోపేతానికి, ప్రతి కార్యకర్త సైనికుల వలె కృషిచేయాలని నియోజకవర్గ పరిశీలకుడు, ఒరిస్సా బిజెపి ఎమ్మెల్యే భూదాన్ ముర్ము అన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో
సోమవారం నర్సింహులపేట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
డోర్నకల్ నియోజకవర్గ నాయకులు భానోత్ ప్రభాస్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఎమ్మెల్యే ప్రవాస్ యోజన" కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే భూదాన్ ముర్ము మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జిల్లా నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు.దేశంలో మోడీ పాలనలో దేశం సమగ్ర అభివృద్ధి సాధించిందనీ ,ప్రపంచ దేశాలు మోడీ పాలనవైపు చూస్తున్నారని , ఇప్పటి నుండే పార్టీ కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రజల్లోకి తీసుకెళ్లాలని గడపగడపకు వెళ్ళి ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఒరిస్సా బీజేపీ ఎమ్మెల్యే బుధాన్ ముర్ము ను బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, లక్ష్మణ్ నాయక్, డోర్నకల్ అసెంబ్లీ కన్వీనర్ పూర్ణచందర్ రెడ్డి, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, గిరిజన మోర్చా నాయకురాలు దేవిక నాయక్, నాయకులు బుల్లెట్ కృష్ణ, కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
