షోయబుల్లాఖాన్ స్ఫూర్తితో జర్నలిస్టులు ముందుకు సాగాలని టియుడబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ,జిల్లా కార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో షోయాబుల్లాఖాన్ 75వ వర్థంతి ని
ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళుల అర్పించారు.అనంతరం చిత్తనూరి శ్రీనివాస్,గాడిపెళ్ళి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కలం యోధుడు అక్షరాలని ఆయుధాలుగా మలచి నాటి నిజాం గూండాల ఆగడాలను అడ్డుకొని ప్రజలను చైతన్య దీపికలుగా మలచిన నేటి జర్నలిస్టులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన షోయెబుల్లా ఖాన్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.షోయబుల్లాఖాన్ నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తాజ్వీ పత్రికను నిషేధించింది షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగష్టు 22 న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు. ఏ చేతులతోనైతే నిజమును వ్యతిరేకించాడో ఆ చెయ్యి, అంటే షోయబ్ కుడి చెయ్యి నీ నరికి వేసారని అన్నారు మహబూబాబాద్ ప్రాంత వాసిగా ఈ ప్రాంత జర్నలిస్టులకు అయన ప్రేరణ కావాలని అన్నారు . షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి టియుడబ్ల్యూజే (ఐజేయు) కృషి చేస్తుందని ఇప్పటికే స్థల సేకరణ కు స్థానిక శాసన సభ్యులు శంకర్ నాయక్ చొరవ చూపారని వచ్చే జయంతి వేడుకలను అయన విగ్రహం వద్దే జరుపుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కుమార్, శ్రీనివాస్, కిరణ్ , మధు, అశోక్ బాబు, మనోహర్ ప్రవీణ్, జావేద్, విష్ణు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
షోయబుల్లాఖాన్ స్ఫూర్తితో జర్నలిస్టులు ముందుకు సాగాలి:టియూడబ్ల్యూజె(ఐజెయు).
August 22, 2023
0
