ఇల్లందు ఎమ్మెల్యే టికెట్ కై ధరఖాస్తు చేసిన ఆదివాసీ మహిళా నాయకురాలు గుండెబోయిన నాగమణి.
August 22, 2023
0
ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఆదివాసి మహిళ నాయకురాలు మరియు సీతంపేట ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి మరియు పోదెం వీరయ్య చేతులమీదుగా గాంధీ భవన్ లో ధరఖాస్తు చేశారు.ఈ నేపథ్యంలో గుండెబోయిన నాగమణి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలకు కాంగ్రెస్ తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆదివాసీ,గిరిజన ప్రజల ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, బయ్యారం మండల యూత్ అధ్యక్షులు చాట్ల సంపత్, మరియు మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags
