(నమస్తే మానుకోట న్యూస్ ) నర్సింహులపేట మండల జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ బత్తిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి కోల యాకయ్య అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పరిశీలకులు టీయూడబ్ల్యూజే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షులు చిమ్ముల సాయి రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్లు ,రేఖ ఉపేందర్ ల నేతృత్వంలో ప్రెస్ క్లబ్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఒక సంవత్సర కాలానికి ఈ నూతన కమిటీ కొనసాగనుండగా , నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కొండబత్తిని రవికుమార్,కోల యాకన్నలు మాట్లాడుతూ జర్నలిస్టు మిత్రులందరికీ కలుపుకొని పోయి, ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పని చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా గడ్డి యాకన్న,సంయుక్త కార్యదర్శి గా సంతోష్ నాయక్,ఉపాధ్యక్షులుగా కల్లెడ మధు ,కొమిరె యాకస్వామి,కోశాధికారిగా రేఖ ఉపేందర్ , దాడుల కమిటీ సభ్యులు గా సమ్మయ్య ,నగేష్ ,గణేష్ లతో పాటుగా పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాంపెల్లి రమేష్ ,చౌడవరపు శ్రీను ,నిమ్మల నరేష్ ,గణేష్ ,నగేష్,లింగ్యా నాయక్ ,రమేష్ ,ఎర్రనాగి వెంకన్న ,జెట్టి యాకయ్య ,ఉంగరాల సమ్మయ్య,గుగులోత్ రమేష్ ,భూక్యా రమేష్ ,జాఫర్ ,పొడుపు గంటి నరేష్
.
