Type Here to Get Search Results !

అధికారంలోకి రానున్నది కాంగ్రెస్ పార్టీయే...వారినెవరిని వదలం-బెల్లయ్య నాయక్.

ఎమ్మెల్యే ల దందాలో కెసిఆర్ వాట దారుడు కాబట్టే అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చాడని తెలంగాణ ఆదివాసీ చైర్మన్ బెల్లయ నాయక్ తీవ్రంగా ఆరోపించారు.స్థానిక మానుకోట పట్టణం లోని బెల్లయ్య నాయక్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకర్ నాయక్ అరాచకాల నుండి మానుకోట ప్రజలను కాపాడటానికి వంద శాతం మహబూబాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటాననీ ,రెడ్యానాయక్ కుటుంబ పాలనను తప్పకుండా ఓడించే బాధ్యత తో పాటు 12 ఎస్టీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.కెసిఆర్ ఓడిపోతామనే భయంతోనే రెండు నియోజకవర్గాల్లో పోటీ  చేస్తున్నారని  గజ్వేల్ లో బరాబర్ ఓడిపోతాడు కాబట్టే కామారెడ్డి లో పోటీ చేస్తున్నారని అన్నారు.శంకర్ నాయక్ కు టికెట్ వచ్చిన దగ్గరి నుండి మానుకోట ప్రజల నుండి కొంత మంది తెరాస నాయకుల నుండి విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయని మొన్నటి దాకా శంకర్ నాయక్ ను వ్యతిరేకించామని, ఇప్పుడు కేసుల్లో ఇరికిస్తారేమోననీ ఏమోననీ ఇబ్బందుల్లో పెడతారేమోనని తప్పకుండా తామే అధికారంలోకి  రావాలని చెబుతున్నారని  తెలిపారు.అధికార పార్టీ ని వ్యతిరేకించిన వారెవరు  భయ పడాల్సిన అవసరం లేదని  మీ వెనుక కాంగ్రెస్ పార్టీ అండా వుంటుందని ,బెల్లయ నాయక్ ఏసమయంలోనైనా అందుబాటులో వుంటాడని కరాకండిగా చెప్తున్నానని అన్నారు.కబ్జాకోర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న మానుకోటను రక్షించడానికి నేను వస్తున్నానని అవినీతి అధికారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని  రానున్నది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.ఈ మీడియా సమావేశంలో ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్ ,కిసాన్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ , మాజీ పట్టణ అధ్యక్షులు ముల్లంగి ప్రతాపరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ సభ్యులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు నారాయణ నాయక్, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షులు శంకర్ నాయక్,ఓబిసి మండల అధ్యక్షులు వీరభద్రం, కలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.