(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
జిల్లాలో రెండో విడత దళిత బంధు పథకమును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెండో విడత దళిత బంధు పథకం పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దళిత బంధు పథకానికి అర్హులు అయిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు.మండలాల వారీగా లబ్ధిదారుల నివేదిక రూపొందించి ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లాలని శాసనసభ్యుల పరిశీలన అనంతరం అర్హులైన వారి నివేదిక ఇవ్వాలన్నారు.నివేదిక సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి సన్యాసయ్య, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ అధికారి బాలరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
