ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా భానోతు ప్రభాస్ నాయక్.
నియామక పత్రాన్ని అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్.
(నమస్తే మానుకోట-మహబూబాబాద్)
రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి భాజపా పార్టీ చేస్తున్న కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని పోతూ నిజాయితీగా ,చిత్తశుద్ధితో,పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి అనతి కాలంలోనే పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న డోర్నకల్ నియోజకవర్గ నాయకులు బానోతు ప్రభాస్ నాయక్ ను భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమిస్తున్నట్లుగా ఆ పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.అనంతరం డోర్నకల్ నియోజకవర్గ భాజపా నాయకులు బానోతు ప్రభాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని, ఇప్పటికీ గిరిజనులను సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నుండి ఎంతోమంది గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజనుల ఓట్లతో గెలిచి అందలం ఎక్కారని అయినప్పటికీ గిరిజనులు మాత్రం తీవ్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ,ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ,ఎంతోమంది గిరిజన యువత ఉద్యోగాలు లేక యాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధికై వారి సమస్యల పరిష్కారానికి బిజెపి చేస్తున్న కార్యక్రమాలలో శక్తి వంచన లేకుండా అందరినీ కలుపుకొని పోతూ నిజాయితీతో ,నిబద్ధతతో, చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రభాస్ నాయక్ అన్నారు. తనను గుర్తించి, గిరిజన మోర్చా కార్యవర్గంలో అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు హూస్సేన్ నాయక్ కు,సహరించిన జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్ రావు కు ,జిల్లా ఇంచార్జి కట్టా సుధాకర్ రెడ్డి లకు జిల్లా కార్యవర్గానికి ,తనను ఆదరిస్తున్న అన్ని మండలాల నాయకులకు,కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా,బూతుస్థాయి నుండి కృషి చేస్తూ ముందుకు సాగుతానని ప్రభాస్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా భాజపా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు,బిజెపి జిల్లా ఇంచార్జి కట్టా సుధాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
